Breaking News

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన కిచ్చా సుదీప్

Published on Thu, 02/13/2025 - 09:43

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రో రైలులో సందడి చేశారు. సీసీఎల్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన సుదీప్ మెట్రోలో ప్రయాణించారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్‌లో తన టీమ్‌తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఫిబ్రవరి 14న ఉప్పల్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో తలపడతారు. మరో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్- తెలుగు వారియర్స్‌ను ఢీకొట్టనుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి 2న జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే కిచ్చా సుదీప్ చివరిసారిగా మాక్స్‌ మూవీలో కనిపించాడు.
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)