Breaking News

రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్‌ హీరో.. ఎందుకంటే?

Published on Tue, 01/23/2024 - 10:08

యాక్షన్ ప్రిన్స్, శాండల్‌వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్‌కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది.

అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా..

ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్లో ఆయనకు  మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి  చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా..  అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు.

దీనిపై మాట్లాడిన ధృవ సర్జా..  అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)