Breaking News

దర్శన్ భార్యకు అసభ్యకర సందేశాలు.. మహిళా కమిషన్‌ సీరియస్!

Published on Fri, 08/29/2025 - 10:27

కన్నడ స్టార్‌ దర్శన్‌ ఓ అభిమాని హత్యకేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రియురాలి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకస్వామి అనే అభిమాని పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని అతన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

అయితే ఈ ఘటన తర్వాత దర్శన్ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మీతో పాటు ఆయన కుమారుడు వినీశ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెలమంగళకు చెందిన భాస్కర్ ప్రసాద్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి దర్శన్, ఆమె కొడుకును సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్‌ చర్యలకు దిగింది. అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులను ఆదేశించింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఇటీవల నటి రమ్యపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)