Breaking News

లైంగిక వేధింపులు.. కన్నడ నటుడు అరెస్ట్‌

Published on Sat, 12/28/2024 - 11:42

ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి 2017లో బాలప్పతో పరిచయం ఏర్పడింది. పైకి మంచివాడిగా నటించిన బాలప్ప ఆమెను ప్రేమించాడు. నటి కూడా తిరిగి ప్రేమించాలని వెంటపడ్డాడు. బలవంతపెట్టాడు. అలా ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.

బెదిరింపులు
అయితే తనకు డబ్బు కావాలని, అడిగినంత ఇ‍వ్వకపోతే ప్రైవేట్‌ ఫోటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించాడు. నటి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఈ విషయాలను బయటపెడితే తనకున్న ధనబలంతో, రాజకీయ నాయకుల అండతో నటిపైనే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. చంపడానికి కూడా వెనకాడనని బెదిరించాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. వారు బాలప్పను అరెస్ట్‌ చేసి విచారణ మొదలుపెట్టారు. కాగా సదరు నటికి ఇదివరకే విడాకులవగా ఒంటరిగా నివసిస్తోంది.

చదవండి: Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్‌ రిలీజ్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)