Breaking News

తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్

Published on Fri, 03/08/2024 - 12:59

'కల్కి' హీరోయిన్ దీపికా పదుకొణె.. తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ మరో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈమె ప్రముఖ హీరోకి భార్య కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వనుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కన్నడలో స్టార్ హీరోయిన్‌ మిలానా నాగరాజ్. అప్పట్లో పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే చెందిన డార్లింగ్ కృష్ణ అనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్ల వివాహం జరిగింది. 2013 నుంచి నటిస్తున్న ఈమె.. పెళ్లి తర్వాత కూడా ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది.

మిలానా నాగరాజ్ లేటెస్ట్ మూవీ 'ఫర్ రెన్'... రెండు వారాల క్రితమే అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'అరామ్ అరవింద స్వామి' అనే సినిమా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. సెప్టెంబరులో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ రియల్ లైఫ్ హీరోహీరోయిన్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)