Breaking News

కోడలితో కలిసి కొడుకు టార్చర్‌.. పోలీసులను ఆశ్రయించిన నటి

Published on Thu, 06/22/2023 - 18:42

దివంగత దర్శకుడు సిద్దలింగయ్య సతీమణి, కన్నడ నటి శ్యామలా దేవి(68) పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, తరచూ అసభ్యంగా తిడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని పేర్కొంది. కుమారుడు నితిన్‌ మొదట్లో బాగానే ఉండేవాడని, ఎప్పుడైతే అతడికి పెళ్లయిందో అప్పటినుంచి భార్య స్మితతో కలిసి తనను టార్చర్‌ పెడుతున్నాడని వాపోయింది. బెంగళూరులో ఓ ఇల్లు కొన్నానని, అందులోనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నామని చెప్పింది. అయితే ఆ ఇల్లు కొడుకు, కోడలు తమ పేరు మీద రాయాలని నిత్యం వేధిస్తున్నారంది.

కాగా శ్యామలా దేవి కొడుకు, కోడలు పెట్టే వేధింపులు తట్టుకోలేక గతంలో సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ను ఆశ్రయించింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా తన ప్రమేయం లేకుండానే తన ఖాతాలో నుంచి డబ్బులు తీస్తున్నారని ఆరోపించింది. తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న వాళ్లిద్దరినీ ఇల్లు ఖాళీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. కానీ అంతలోనే కోడలు గర్భం దాల్చడంతో కొడుకు క్షమించమని కాళ్లు పట్టుకున్నాడు. తల్లి మనసు కరిగిపోయి ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. 

మారుతారేమో అని ఎదురుచూసింది కానీ అది జరగలేదు. మళ్లీ వాళ్లు వక్రబుద్ధి చూపించారు. శ్యామలాదేవిని వంటగదితో పాటు ఇతరత్రా గదుల్లోకి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఇంటిని తమ పేరు మీద రాయమంటూ నిత్యం వేధించారు. లేదంటే త్వరలోనే చస్తావంటూ శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేశానంటోంది శ్యామలా దేవి.

చదవండి: అనుమానాస్పద స్థితిలో సింగర్‌ మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)