Breaking News

అమెరికాలో శివరాజ్‌కుమార్‌.. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స పూర్తి

Published on Thu, 12/26/2024 - 18:54

కన్నడ సూపర్‌ స్టార్ శివ రాజ్‌కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల  భైరతి రంగల్‌ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్‌పోర్ట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.

అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్‌కుమార్‌ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ ‍అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్‌కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మూత్రాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.

ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్‌ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్‌సీ16లోనూ కనిపించనున్నారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)