Breaking News

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్‌ మంజూరు

Published on Fri, 12/13/2024 - 15:36

రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్‌ మంజూరు అయింది. ఆయనతో పాటు ఏడుగురికి ఈ కేసులో బెయిల్‌ ఇస్తున్నట్లు న్యాయస్థానం వెళ్లడించింది. దర్శన్‌ ఇప్పటికే తన చికిత్స కోసం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేటితో ఆయన బెయిల్‌ గడవు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడవుతో నిమిత్తం లేకుండా బెయిల్‌ మంజూరు కావడంతో దర్శన్‌ అభిమానులు ఆనందిస్తున్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఆరు నెలలుగా పరప్పన జైలులో  హీరో దర్శన్‌ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్‌ కోసం దర్శన్‌ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. అయితే, మరోసారి బెయిల్‌ కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. విశ్వజీత్ శెట్టితో కూడిన  ధర్మాసనం ఈ కేసును విచారించి దర్శన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు కూడా బెయిల్‌ లభించినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శన్‌ ప్రియురాలు పవిత్రకు  అసభ్యతతో కూడిన మెసేజ్‌లు రేణుకాస్వామిని చేస్తున్నాడనే కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్‌, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్‌ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే, వారికి ఇప్పుడు బెయిల్‌ రావడం సంచలనంగా మారింది.
 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు