Breaking News

దర్శన్‌,పవిత్రల బెయిల్‌పై తీర్పు వెల్లడి

Published on Tue, 10/15/2024 - 06:23

కన్నడ హీరో దర్శన్‌ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బెయిలు దక్కలేదు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో   దర్శన్‌, నటి పవిత్రగౌడ బెయిల్‌ పిటిషన్‌ను నగర 57 వ సీసీహెచ్‌ కోర్టు కొట్టివేసింది. బెయిల్‌ వస్తుందనే ఆశతో ఉన్న ఇరువురు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. 

బెయిల్‌ పిటిషన్‌ మీద ప్రభుత్వ వకీలు ప్రసన్నకుమార్‌, దర్శన్‌ న్యాయవాది సీవీ.నాగేశ్‌ సుదీర్ఘ వాదనలు వినిపించారు. బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ వకీలు, ఇవ్వాలని దర్శన్‌ ప్లీడరు వాదించారు. గత కొన్ని రోజులుగా బెయిలు అర్జీపై వాదనలు సాగుతున్నాయి. జడ్జి జైశంకర్‌ తీర్పు వెలువరిస్తూ బెయిలు ఇవ్వడం లేదని ప్రకటించారు. కానీ, ఇదే కేసులో రవిశంకర్‌, దీపక్‌ అనే ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జూన్‌ 10 నుంచి జైలువాసం

దర్శన్‌, పవిత్రలు జూన్‌ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. ఇటీవల సిట్‌ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్‌ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్‌జైల్‌లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు