Breaking News

తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు

Published on Mon, 05/13/2024 - 15:22

కన్నడ నటుడు చేతన్‌ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్‌ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్‌ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. 

నటుడిపై దాడి
తిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్‌ డ్యామేజ్‌ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు.  ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.

న్యాయం కావాలి
తనకు జరిగిన అన్యాయాన్ని చేతన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్‌ చేశాడు.  తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్‌ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

నిందితుడు అరెస్ట్‌
చేతన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్‌ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్‌లో నటించాడు. ‍'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్‌', 'బజార్‌'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు.

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)