Breaking News

నెలసరిలో పర్యటనలు.. వాష్‌రూమ్‌కి వెళ్లలేకపోతున్నాం: కంగనా రనౌత్‌

Published on Sat, 08/16/2025 - 13:20

సినిమాలలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ కష్టాలు అంటోంది నటి, ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranaut). రాజకీయాల్లో ఉన్నప్పడు నెలసరి సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. సామాన్య మహిళలే కాదు ఎంపీలు కూడా నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ బాధను వర్ణించడం కూడా అసాధ్యం అని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. సినిమా, రాజకీయ రంగాలను పోలుస్తూ..మహిళగా తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది.

‘సినిమాలు చేసినప్పుడు నెలసరి సమయంలో అంత ఇబ్బంది పడేదాన్ని కాదు. షూటింగ్‌ సమయంలో హీరోయిన్స్‌కి సపరేట్‌ కారవాన్‌లు ఉంటాయి. మా కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. పిరియడ్ సమయంలో మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. వాష్‌రూమ్‌లకు వెళ్లేందుకు సదుపాయం ఉంటుంది. విశ్రాంతి తీసుకోవచ్చు. టీమ్‌తో మాట్లాడి మనకు కావల్సినవన్నీ తెప్పించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. 

షెడ్యూల్‌ ముందే ఫిక్స్‌ అవుతుంది. ఒక్కోసారి పర్యటనలో భాగంగా రోజులకు 12 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం టాయిలెట్‌ వెళ్లడానికి కూడా వీలుపడదు. నాకే కాదు మహిళా ఎంపీలందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరికి ఇది చిన్న సమస్యగా అనిపించొచ్చు కానీ.. ఇది చాలా పెద్ద ఇబ్బంది. దీన్ని వర్ణించడం కూడా అసాధ్యం’ అని కంగనా చెప్పుకొచ్చింది.  

హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన రాజ్‌పుత్‌ కుటుంబంలో కంగనా.. 2006లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఏక్‌ నిరంజన్‌ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది.  హీరోయిన్‌గానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ రాణించింది. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం(హిమాచల్‌ ప్రదేశ్‌) నుంచి కంగనా ఎంపీగా ఎన్నికయ్యారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)