Breaking News

వరుస ఫ్లాపులు.. ‘తగ్గేదేలే’ అంటున్న హీరోయిన్‌!

Published on Wed, 11/22/2023 - 09:29

కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ ఒకరు. ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్‌లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్‌ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్‌ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి.

తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్‌ను వరించింది. ఇందులో నటుడు మాధవన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్‌ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్‌ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్‌కు చాలా ముఖ్యం.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)