Breaking News

నా జీవితంలో ఇదే మొదటిసారి: కంగనా

Published on Sun, 08/27/2023 - 06:47

గతంలో రజనీకాంత్‌ కథానాయకుడు నటించిన 'చంద్రముఖి' చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'చంద్రముఖి–2'. ఆ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించారు. లారెన్స్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ చంద్రముఖిగా నటించడం విశేషం. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్‌ అందించారు.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా  చైన్నెలోని ఒక విశ్వవిద్యాలయంలో చంద్రముఖి–2 చిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ తనను మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చిన లైకా ప్రొడక్షన్‌న్స్‌కు, పి.వాసుకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నిర్మాత సుభాస్కరన్‌ తమిళ సినిమాకు దక్కిన భాండాగారం అని దర్శకుడు పి.వాసు పేర్కొన్నారు.

కంగనారనౌత్‌ మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదు అన్నారు అలాంటిది దర్శకుడు పి. వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగాను అన్నారు. అందుకు ఆయన కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్పారన్నారు. లారెన్స్‌ మాట్లాడుతూ తాను సహాయ నృత్య కళాకారుడుగా నటిస్తున్నప్పుడే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పనిచేశానన్నారు.

(ఇదీ చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్‌' ఫేమ్‌ జాఫర్‌ సాదిఖ్‌.. ఆమె ఎవరంటే)

ఆ తర్వాత నృత్య దర్శకుడుగా, నటుడుగా, దర్శకుడుగా చిత్రాలు చేసిన తాను కథానాయకుడిగా నటించిన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారన్నారు. ఇలా 40 ఏళ్లకుపైగా పి వాసు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడుగా కొనసాగుతున్నారని అన్నారు. తాను ఈ చిత్రంలో వేట్టైయాన్‌ పాత్రలో నటించానని, దీనికి లభించే ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని లారెన్స్‌ పేర్కొన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)