Breaking News

రాణి రాక షురూ

Published on Sun, 08/31/2025 - 02:13

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘క్వీన్‌’ రెండో భాగం రానుంది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో, రాజ్‌కుమార్‌ రావు కీలక పాత్రలో నటించిన తొలి భాగం 2014లో విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ సన్నాహాలు ఊపందుకున్నాయని బాలీవుడ్‌ సమాచారం. ‘క్వీన్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన వికాస్‌ ‘క్వీన్‌ 2’ సినిమానూ డైరెక్ట్‌ చేయనున్నారని, ఆల్రెడీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని టాక్‌. అంతే కాదు... ఈ ‘క్వీన్‌ 2’ చిత్రీకరణకు వికాశ్‌ లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారట. ‘క్వీన్‌’ సినిమా మాదిరిగానే, ‘క్వీన్‌ 2’ చిత్రీకరణ కూడా కొంత ఇండియాలో, ఎక్కువ శాతం విదేశాల్లో జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

నవంబరులో ఈ సినిమా షూటింగ్‌లో కంగనా రనౌత్‌ పాల్గొంటారట. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, వచ్చే వేసవిలో రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. మరి... అనుకున్నట్లుగానే పదేళ్ల తర్వాత ‘క్వీన్‌’ సీక్వెల్‌ తెరకెక్కుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇక మరో రెండు రోజుల్లో రాణి (కంగన) పెళ్లి అనగా, పెళ్లికొడుకు రాణితో పెళ్లిని వద్దనుకుంటాడు. ఆ తర్వాత రాణి తనను తాను బలమైన అమ్మాయిగా మలచుకుని, జీవితంలో ఎలా రాణించింది? రాణిని వద్దనుకున్న అబ్బాయే, ఆమెను మళ్లీ ఎలా వివాహం చేసుకున్నాడు? అనే కోణంలో ‘క్వీన్‌’ కథ సాగుతుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)