Breaking News

ఆస్కార్‌ మ్యూజియమ్‌లో మెమోరీస్ గుర్తు చేసుకున్న ఇండియన్‌ స్టార్స్‌

Published on Fri, 07/28/2023 - 00:52

లాస్‌ ఏంజిల్స్‌లోని ఆస్కార్‌ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్‌ రెహమాన్‌. ఆ మ్యూజియమ్‌లోనే హాలీవుడ్‌ ఫేమస్‌ ఫిల్మ్‌ ‘ది గాడ్‌ఫాదర్‌’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్‌. 81వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ (2008) సినిమాకుగాను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఏఆర్‌ రెహమాన్‌ ఆస్కార్‌ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్‌ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ హీరోగా, కమల్‌హాసన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్‌ వీడియో లాంచ్‌ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే.

ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్‌ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్‌ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్‌ వెస్ట్‌మోర్‌ను కలిసిన కమల్‌హాసన్‌ తాజాగా ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి ఆస్కార్‌ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్‌లో కమల్‌ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతదర్శకుడు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)