Breaking News

'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!

Published on Sat, 07/13/2024 - 15:42

'భారతీయుడు 2' నిన్న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శుక్రవారం నాడు బాగానే ఆక్యుపెన్సీలు కనిపించాయి. తమిళంలో ఇలా కూడా కనిపించలేదు. అయితే సినిమా మరీ అంత కాకపోయినా ఓ మాదిరి అంచనాలతో బరిలో నిలిచింది. కానీ కనీసం అంటే కనీస వసూళ్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అయితే సినిమాకు ఇలా అవుతుందని కమల్ ముందే పసిగట్టాడా అని సందేహం వస్తోంది.

(ఇదీ చదవండి: భారతీయుడు 2 కలెక్షన్స్‌.. తొలిరోజు ఎన్ని కోట్ల రూపాయలంటే?)

1996లో వచ్చిన 'భారతీయుడు'.. అప్పట్లో తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సెన్సేషన్ సృష్టించింది. దీనికి సీక్వెల్ తీయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారు. కాకపోతే షూటింగ్‌లో ప్రమాదం, కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఎలాగోలా పూర్తి చేసి తాజాగా థియేటర్లలోకి తీసుకొచ్చారు. సీక్వెల్ ఒకటే అనుకున్నది కాస్త రెండు భాగాలైంది. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ చేయగా, ఆరు నెలల తర్వాత మూడో భాగాన్ని విడుదల చేయనున్నారు.

'భారతీయుడు 2' ఫలితాన్ని కమల్ హాసన్ ముందే పసిగట్టేశాడో ఏమో గానీ రిలీజ్‌కి ముందే తనకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో నిర్మాణ సంస్థ లైకా రెండు భాగాలకు తలో రూ.75 కోట్ల చెప్పున మొత్తంగా రూ.150 కోట్లు ఇచ్చిందట. మిగతా నటీనటులకు మాత్రం ఒక్క మూవీకి అన్నట్లే పారితోషికంగా ఇచ్చారు. ఇక ప్రాజెక్టులో డైరెక్టర్ శంకర్ కూడా భాగస్వామినే. కాబట్టి అతడికి కూడా నష్టాలు గ్యారంటీ. ఓవరాల్‌గా 'భారతీయుడు 2' వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది కమల్ మాత్రమే అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్‌ భోలే షావలి)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు