Breaking News

మరో చిత్రానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్!

Published on Tue, 01/02/2024 - 07:02

ఇటీవల విక్రమ్‌ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన నటుడు కమల్ హాసన్‌. తదుపరి హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్‌ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్‌ నాయకన్‌ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్‌ లైఫ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్‌ లైఫ్‌ చిత్ర షూటింగ్‌ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్‌, నిర్మాత ఆనంద్‌ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్‌  సింబల్ చూపగా కమలహాసన్‌ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్‌పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్‌ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్‌ లైఫ్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)