Breaking News

కమల్ హాసన్‌ భారీ బడ్జెట్‌ చిత్రం.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది!

Published on Mon, 07/01/2024 - 21:04

కమల్ హాసన్‌ నటిస్తోన్న తాజా చిత్రం ఇండియన్‌- 2(భారతీయుడు-2). ఈ సినిమాను శంకర్ డైరెక్షన్‌లో భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ  సినిమా నుంచి నుంచి ‘క్యాలెండర్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్‌, 2017లో మిస్ యూనివ‌ర్స్ విజేత డెమి-లీ టెబో  స్పెషల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చంద్ర‌బోస్ రాయ‌గా.. శ్రావ‌ణ భార్గ‌వి ఆల‌పించారు.

కాగా.. 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. క‌మ‌ల్ హాసన్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుద‌లైన సాంగ్స్, గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి.

ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‍అనిరుద్ ర‌విచంద్ర‌న్‌ సంగీతమందిస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)