Breaking News

ఇండియన్‌-2 బాగాలేదా?.. అసలు కమల్‌ హాసన్‌ ఏమన్నారంటే?

Published on Sun, 07/07/2024 - 21:32

కమల్ హాసన్- శంకర్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్‌ చిత్రం ఇండియన్-2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా కమల్‌ హాసన్‌ సింగపూర్‌కు వెళ్లారు. తనకు భారతీయుడు-2 కంటే భారతీయుడు-3 ఎక్కువగా నచ్చిందని అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియన్‌-2 బాగాలేదా అని చర్చ మొదలెట్టారు. తాజాగా ఈ కామెంట్స్‌పై  కమల్‌ హాసన్‌ క్లారిటీ ఇచ్చారు.

కమల్‌ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన విషయాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు.  రెండో పార్ట్‌ కంటే మూడో పార్ట్‌ బాగుందని చెప్పా అంతే. అంటే ఇక్కడ పార్ట్‌-2 బాగాలేదని కాదు. మనం సాంబార్, రసం లాంటి వాటితో భోజనం చేస్తున్నప్పుడు ఆ తర్వాత తినే పాయసం గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. నా కెరీర్‌లో ఇండియన్‌-2 కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు స్వీకరించా. కొవిడ్‌ లాక్‌డౌన్‌, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యంతో కొందరు నటులు మరణించడం లాంటి ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్‌ జాగ్రత్తలు తీసుకున్నారు' అని అన్నారు. కాగా.. ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆరు నెలల్లోనే పార్ట్‌- 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు