Breaking News

'కల్కి'లో నా పాత్ర ఇంతవరకే: కమల్‌ హాసన్‌

Published on Mon, 03/25/2024 - 10:50

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో కమల్ హాసన్ నటించిన రాబోయే మూడు సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 AD గురించి తాజాగా ఆయన అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్‌ వివరాలతో పాటు పలు వివరాలను తెలిపారు. శంకర్‌ దర్శకత్వం వహించిన ఇండియన్‌ 2 పనులు పూర్తి అయ్యాయని చెప్పిన కమల్‌.. ఇండియన్‌ 3 షూటింగ్‌ కూడా పూర్తి అయిందని షాకిచ్చాడు. ప్రస్తుతం ఇండియన్‌ 2 విడుదలకు రెడీగా ఉందని చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత  దాని సీక్వెల్‌ పోస్ట్ ప్రోడక్షన్‌ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

కల్కి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కమల్‌ పంచుకున్నాడు. 'కల్కి' సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించినట్లు ఆయన రివీల్‌ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమం కూడా పూర్తి అయిందని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ కొంతమేరకు షాక్‌ అయ్యారు. ఇకపోతే  ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం 'థగ్‌ లైఫ్‌' చిత్రీకరణ మొదలుపెడతామని కమల్‌ ప్రకటించారు.

కల్కిలో కమల్‌ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించగానే ఫ్యాన్స్‌ కొంతమేరకు నిరాశచెందారు. మరికొందరు మాత్రం డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ టాలెంట్‌ను గుర్తు చేస్తూ కల్కిలో కమల్‌ 5నిమిషాలు కనిపించినా తీవ్రమైన ఇంపాక్ట్‌ ఉండే పాత్రనే డిజైన్‌  చేసుంటారని నెటిజన్లు చెబుతున్నారు. కమల్ హాసన్‌ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 29 ఏళ్లైంది. ఆయన నేరుగా టాలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం.. ‘శుభ సంకల్పం’ (1995). కానీ చాలా రీమేక్‌, డబ్బింగ్‌ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం విక్రమ్‌తో మెప్పించిన కమల్‌ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’లో అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ తర్వాత మళ్లీ కల్కితో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Videos

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)