Breaking News

ఆ తర్వాతే నటించడం మానేస్తా : కమల్‌ హాసన్‌

Published on Tue, 12/02/2025 - 16:20

71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్‌ హాసన్‌. యంగ్‌ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు. 

తాజాగా ఆయన నటి మంజు వారియర్‌తో కలిసి కేరళలో అర్ట్‌ అండ్‌ లిటరేచర్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.

‘నన్ను రిటైర్‌ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్‌(Kamal Haasan) చెప్పుకొచ్చాడు. 

మొత్తానికి ఓ బ్లాక్‌ బస్టర​ సినిమా తీసి సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని కమల్‌ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్‌లైఫ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్‌ కనగరాజ్‌తో విక్రమ్‌ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)