Breaking News

అమిగోస్‌’లో 2.17 గంటలు నేనే కనిపిస్తా: కల్యాణ్‌ రామ్‌

Published on Thu, 02/09/2023 - 08:30

‘బింబిసార’ చిత్రానికి ముందే ‘అమిగోస్‌’ కథ విన్నాను. రాజేంద్రగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల లక్ష్యం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, ఆషికా రంగనాథ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ పంచుకున్న విశేషాలు. 

►‘బింబిసార’ హిట్‌ తర్వాత నేను కథలు ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే ‘బింబిసార’, ‘అమిగోస్‌’, ‘డెవిల్‌’ సినిమాల కథలను 2020లోనే ఓకే చేశాను. ‘బింబిసార’ హిట్‌ తర్వాత కొత్తగా ఏ కథనీ ఎంచుకోలేదు. అయితే ఆ సినిమా విజయం నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఇంకా పెద్ద విజయాన్ని నా నుంచి ఆశిస్తారు. అందుకే మంచి కాన్సెప్ట్‌, స్టోరీ ఉన్నవి ఒప్పుకోవాలి. లక్కీగా నాకు అన్నీ అలాంటి మంచి కథలు వస్తున్నాయి.

► ‘అమిగోస్‌’ చిత్రంలో నేను త్రిపాత్రాభినయం చేశాను. సిద్ధార్థ్‌ చాలా చురుకుగా ఉంటాడు. మంజునాథ్‌ది చాలా సైలెంట్‌ అండ్‌ సాఫ్ట్‌ క్యారెక్టర్‌. మైఖేల్‌ పాత్ర గ్యాంగ్‌స్టర్‌ని పోలిన విలన్‌లా ఉంటుంది. విలన్‌లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. ట్రిపుల్‌ రోల్‌ చిత్రంలో కనీసం ఇద్దరు కథానాయికలైనా ఉంటారు. కానీ ఇది రెగ్యులర్‌ సినిమాలకు పూర్తి విభిన్నమైనది కావడంతో ఒక హీరోయిన్‌ మాత్రమే ఉంటుంది. పైగా ఈ మూవీలో విలన్‌ ఉండకపోవడం ఓ విశేషం.

► మనిషిని పోలిన మనుషులను ‘డాపుల్‌ గాంగర్‌’ అంటారని రాజేంద్రగారు చెప్పారు. ఈ సినిమాకి ‘అమిగోస్‌’ టైటిల్‌ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందా? అన్నాను. అమిగో అనే పదం సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారని చెప్పడంతో ఫిక్స్‌ చేశాం. సినిమా చూస్తే ఆ టైటిల్‌ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. ఈ మధ్య సూపర్‌ హిట్‌ అయిన ‘కాంతారా’ టైటిల్‌ అర్థం నాకు తెలీదు. దాని గురించి వెతికితే ‘వైల్డ్‌ ఫారెస్ట్‌’ అని అర్థం అయింది.

► కోవిడ్‌ సమయంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం కావడానికి కారణం ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటి? అని తెలుసుకున్నాను. ‘అమిగోస్‌’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటే.. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్‌ రామ్‌నే చూస్తారు.. సినిమాలో జస్ట్‌ రెండు నిమిషాలు మాత్రమే కనబడను. ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉంటుంది.

► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘డెవిల్‌’ మూవీ చిత్రీకరణ మే నెలలో పూర్తవుతుంది. ‘బింబిసార 2’ షూటింగ్‌ని ఈ ఏడాది ఆఖరులో ప్రారంభిస్తాం. 
► తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో నేను చెబితే బాగుండదు. వైద్యం అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబితేనే బాగుంటుంది.  

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)