Breaking News

ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!

Published on Wed, 07/12/2023 - 18:04

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రస్తుతం కూతురితో కలిసి ఉంటోంది. భర్త కల్యాణ్ దేవ్.. శ్రీజ దగ్గర కాకుండా తన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అధికారికంగా బయటకు చెప్పలేదు గానీ విడాకులు తీసుకున్నారనే టాక్ చాలారోజుల నుంచి వినిపిస్తోంది. గతంలో వీళ‍్లిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే దీనికి ఉదాహరణ. సరే అది పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది.

(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)

కారణం ఏంటో మరి
చిరంజీవికి ఇద్దరు కుమార‍్తెలు. అందులో పెద్దమ్మాయి సుస్మిత ఓవైపు స్టైలిష్ట్, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. రెండో కూతురు శ్రీజ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధంగా కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. కారణమేంటో తెలియదు గానీ భార్యభర్తలు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.

వారంలో ఒక్కసారే
పాప నవిష్క.. ప్రస‍్తుతం తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా కల్యాణ్ తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్‌.. ఆ స్టార్ హీరోతో కలిసి!)

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)