Breaking News

Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్‌ అశ్విన్‌ ఏం చూపించబోతున్నాడు?

Published on Wed, 06/26/2024 - 08:49

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌,కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది.

మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌నే నాగ్‌ అశ్విన్‌ తీసుకొని దానికి సాంకేతిక జోడించి, సినిమాటిక్‌గా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్‌, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా.

కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం.  అయితే ఇందులో ‘కల్కి’ ఎవరు? ‘కలి’ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు. హీరో ప్రభాస్‌ పోషించిన పాత్ర పేరు ‘భైరవ’. అశ్శత్థామగా అమితాబ్‌  నటించాడు. కమల్‌ పోషించిన పాత్ర పేరు ‘సుప్రీం యాస్కిన్‌’ అని వెల్లడించారు. ఇక గర్భిణీ ‘సమ్‌-80’ గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. 

మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్‌. సుప్రీం యాస్కిన్‌ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కమల్‌ పోషించిన సుప్రీం యాస్కిన్‌ పాత్ర  ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్‌ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్‌ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది.

 భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్‌ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే.  డైరెక్టర్‌ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్‌ 27 రిలీజ్‌)ఆగాల్సిందే.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)