Breaking News

నాలుగు రోజుల్లో కల్కి కలెక్షన్స్‌.. ఎక్కడ ఎంత వచ్చిందంటే..?

Published on Mon, 07/01/2024 - 13:51

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. సినిమా పట్ల హిట్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గడం లేదు. కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని రూపొందించాడు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌ కల్కి మూవీలో నటించి మెప్పించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ఆ విజువల్‌ వండర్‌ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతున్నారు. మహాభారతాన్ని ఫ్యూచర్‌ కథకు ముడి పెట్టి కల్కిని తెరకెక్కించిన  నాగ్ అశ్విన్‌ను నెటిజన్లు అభిమానిస్తున్నారు.

కల్కి నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. తెలుగులో 204.5 కోట్లు, హిందీలో రూ. 134.5 కోట్లు, తమిళ్‌లో రూ. 32.9 కోట్లు, మలయాళంలో రూ.35.1 కోట్లు, ఇతర దేశాల్లో రూ. 158 కోట్లు వచ్చాయి. అదె నెట్‌ పరంగా అయితే కల్కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగురోజుల్లో రూ. 320 కోట్లు రాబట్టింది.
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)