Breaking News

రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!

Published on Sat, 07/13/2024 - 13:43

ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. 

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్‌ రోజే(జూన్‌ 27) హిట్‌టాక్‌ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్‌ ప్రకటించారు. 

(చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్‌)

రిలీజ్‌ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్‌, అమితాబ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. హాలీవుడ్‌ మార్వెల్‌ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

ఏడో చిత్రంగా ‘కల్కి’
ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్‌ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) 1387 కోట్లు, కేజీయఫ్‌2 (2022) రూ.1250 కోట్లు, జవాన్‌ (2023) రూ.1148 కోట్లు, పఠాన్‌ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)