Breaking News

కమల్ హాసన్ 'కలి' కాదు.. 'కల్కి' సీక్రెట్స్ బయటపడ్డాయ్!

Published on Sun, 07/21/2024 - 13:34

'కల్కి' సినిమా వచ్చి నెలరోజులు దగ్గరైపోయింది. వేరే సినిమాలేం సరైనవి లేకపోవడంతో ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతోంది. మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'కల్కి' నుంచి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)

'మీరు 'కల్కి'లో చూసింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్‌లు ఉంటాయి. వీటన్నింటినికీ సుప్రీం యాష్కిన్ నాయకుడు. కంటికి కనిపించని అద్భుత శక్తి 'కలి' దిగువన ఇతడు పనిచేస్తుంటాడు' అని నితిన్ జిహానీ చెప్పుకొచ్చాడు.

'కల్కి' చూసిన తర్వాత చాలామంది కమల్ హాసన్.. కలి పాత్రధారి అనుకున్నారు. కానీ నితిన్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే కలి, సుప్రీం యాష్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అలానే ఏడు కాంప్లెక్స్‌లు అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే సినిమాల్లో వీటిని చూపిస్తారేమో? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో?

(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)