తమిళనాడు అవార్డ్స్‌ ప్రకటన.. సాయి పల్లవి, అనిరుధ్‌, ఎస్‌ జే సూర్యలకు దక్కిన గౌరవం

Published on Wed, 09/24/2025 - 13:24

తమిళనాడు ప్రభుత్వం తాజాగా కలైమామణి అవార్డ్స్‌ను ప్రకటించింది. సాహిత్యం, సంగీతం,  నాటకం వంటి రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డ్‌తో గౌరవిస్తారు.   2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఈ అవార్డ్‌కు ఎంపికైన వారి జాబితాను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెలలో చెన్నైలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యున్నత పౌర పురస్కారంగా 1954 నుంచి ఈ అవార్డ్స్‌ను అందిస్తున్నారు.

ఈ అవార్డు అందుకోనున్న గ్రహీతలలో నటి సాయి పల్లవి, దర్శకుడు-నటుడు ఎస్.జె. సూర్య,  దర్శకుడు లింగుసామి (2021), నటుడు విక్రమ్ ప్రభుతో పాటు మరో ముగ్గురు (2022),  సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, నటుడు మణికందన్ (2023) ఉన్నారు.  2021- 2023 సంవత్సరాలకు సంబంధించి ఈ అవార్డ్‌ కోసం మొత్తం 90 మంది కళాకారులు ఎంపికయ్యారు. కొరియోగ్రాఫర్, నటుడు శాండీతో పాటు నేపథ్య గాయని శ్వేతా మోహన్ వంటి స్టార్స్‌ ఉన్నారు. జాతీయ పురస్కారాల విభాగంలో నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించారు. 

1954లో తమిళనాడు ప్రభుత్వం స్థాపించిన తమిళనాడు ఈశై నాటక మండలి (Tamil Nadu Iyal Isai Nataka Mandram) ద్వారా ఈ అవార్డ​్‌ ప్రారంభించబడింది. సంగీతం, నాటకం, నృత్యం, చిత్రకళ, సినిమా, సాహిత్యం వంటి రంగాల్లో విశిష్ట కృషి చేసిన కళాకారులకు ఈ అవార్డు అందజేస్తారు. ఇది తమిళనాడులో అత్యున్నత కళా పురస్కారంగా భావించబడుతుంది. దక్షిణ భారతదేశంలో కళాకారులకు ఇది ఒక గౌరవ చిహ్నంగా నిలుస్తుంది. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వైయస్ సుధా రఘునాథన్, వైజయంతీమాలా వంటి ప్రముఖులు ఈ అవార్డును ఇప్పటికే పొందారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)