Breaking News

స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం!

Published on Thu, 06/15/2023 - 10:06

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. అయితే ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే స్టార్‌దా వెలుగొందుతున్నారు. ఇక తమిళంలో 2008లో పళని చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తరువాత విజయ్‌, అజిత్‌, కార్తీ అంటూ స్టార్‌ హీరోలతో జతకట్టి అగ్రకథానాయకి వరుసలో చేరారు. అదేవిధంగా తెలుగులోనూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్‌ కిచ్లూ అనే వ్యక్తిని పేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. దీంతో కాజల్‌ అగర్వాల్‌ నటనకు గుడ్‌బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది.

(ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!)

కాగా.. 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అలాంటిది తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అంతకుముందే అంగీకరించిన ఇండియన్‌- 2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా నటించడం మొదలెట్టడంతో ఆ చిత్ర షూటింగ్‌ సమయంలోనే వర్కౌట్స్‌ చేసి మరింత నాజూగ్గా తయారయ్యారు. దీంతో కాజల్‌ సెకెండ్‌ ఇన్నింగ్‌ మొదలైంది.

ప్రస్తుతం కమలహాసన్‌ సరసన నటిస్తున్న ఇండియన్‌ 2 చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్‌ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ గురించి మరో షాకింగ్‌ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాజల్‌ అగర్వాల్‌ నటనకు స్వస్తి చెప్పబోతున్నారన్నదే ఆ ప్రచారం.

కాజల్ రెండోసారి గర్భందాల్చారని.. దీంతో నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కారణం కాజల్‌ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త అవకాశాల కోసం అనే మరో కోణం కూడా అందులో దాగి ఉందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

(ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!)

ఇలాంటి సమయంలో నటనకు స్వస్తి చెప్పడం నమ్మశక్యం కాని ప్రచారం అనే భావించాలి. అయితే తన బిడ్డ సంరక్షణ కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉండాలని ఆమె భావించవచ్చుననే అభిప్రాయం ఒక వర్గం నుంచి వ్యక్తం అవుతోంది. అయితే కాజల్‌ అగర్వాల్‌ మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. మరి ఇలాంటి ప్రచారంపై కాజల్‌ ఏమంటారో చూడాలి.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)