Breaking News

'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్‌

Published on Sat, 11/15/2025 - 13:52

పాన్‌‌ ఇండియా రేంజ్‌లో ‘‘కాంత’ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే వస్తుంది. ముఖ్యంగా దుల్కర్‌ సల్మాన్‌ తన కెరీర్‌లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు. భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది. సెల్వమణి సెల్వరాజన్  దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్‌ సల్మాన్  వేఫేర్‌ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

కాంత చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ. 10.5 కోట్ల గ్రాస్‌  వసూలు చేసిందని మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుండి చాలా సానుకూల సమీక్షలు వచ్చాయి. కానీ, తెలుగు సమీక్షలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌లో కాంత సినిమా నిరాశపరిచే విధంగా ఉందంటూ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్‌ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని  దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)