Breaking News

ఈ సినిమాతో టాలీవుడ్‌ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్‌

Published on Sat, 06/08/2024 - 08:47

టాలీవుడ్‌ యాక్టర్‌ అరవింద్ కృష్ణ  హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఏ మాస్టర్ పీస్'. సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు సూపర్ హీరోగా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ ఇప్పటికే నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమాలో అషురెడ్డి, స్నేహా గుప్త హీరోయిన్లుగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇందులో మరో ప్రధాన హీరోయిన్‌గా జ్యోతిరాయ్ ఎంట్రీ ఇస్తుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో బుల్లితెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జ్యోతిరాయ్. ఇప్పుడు ఆమె వెండితెరపై తన గ్లామర్‌ లుక్‌తో ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా  ఎంట్రీ ఇవ్వ‌డంపై జ్యోతి రాయ్ తన ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.  ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుందని ఆమె పేర్కొంది. డైరెక్టర్‌ సుకుతో తన వివాహం జరిగిందని ఆమె తెలిపింది. ఆ సమయం నుంచే టాలీవుడ్ తన మెట్టినిల్లు అయిపోయిందని ఈ కన్నడ బ్యూటీ పేర్కొంది. 'ఏ మాస్టర్ పీస్' చిత్రానికి డైరెక్టర్‌ కూడా సుకు పూర్వజ్‌ కావడం విశేషం. ఇక నుంచి తెలుగులో సినిమాలు చేయడం కొనసాగిస్తానని జ్యోతి రాయ్ తెలిపింది.

భార‌తీయ‌ పురణాల నేపథ్యాన్ని జోడించి ఏ మాస్ట‌ర్ పీస్ సినిమా తెరకెక్కించినట్లు డైరెక్టర్‌ సుకు తెలిపాడు. భాగవతంలోని జయ, విజయుల పాత్ర‌ల ఆధారంగా చేసుకుని హీరో, విలన్ పాత్రలను డిజైన్ చేసినట్లు ఆయన చెప్పాడు. చిన్న ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఏ మాస్టర్ పీస్ ఫైనల్లగా భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందినట్లు ఆయన తెలిపాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)