ఆ హిట్‌ డైరెక్టర్‌తో రజనీకాంత్‌ సినిమా..!

Published on Tue, 09/24/2024 - 13:40

జైలర్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ జోరు పెంచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు తీసేందుకు తన షెడ్యూల్స్‌ ఉంటున్నాయి. అక్టోబర్‌ 10న వేట్టైయాన్‌ విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌, టీజర్‌  ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వెట్టైయాన్‌తో పాటు 'కూలీ' చిత్రాన్ని కూడా ఆయన పట్టాలెక్కించారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్‌ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో 'జైలర్‌ 2' ప్రాజెక్ట్‌లో రజనీ ఎంట్రీ ఇస్తారు.

ఈ సినిమాల తర్వాత కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు రజనీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో '2018' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌తో రజనీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది.  తమిళంలో వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటించమని మొదట శింబును సంప్రదించారట. అయితే, ఈ కథకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాత్రమే సెట్‌ అవుతారని మేకర్స్‌ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఇప్పటికే సినిమా కథను కూడా రజనీకి వినిపించారట. అయితే, త్వరలో చిత్ర యూనిట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పే ఛాన్స్‌ ఉందని వార్తలు వస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)