బ్యాక్‌ టు హైదరాబాద్‌

Published on Tue, 02/24/2026 - 01:10

జోర్డాన్  నుంచి ‘డ్రాగన్ ’ మూవీ టీమ్‌ తిరిగొచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). రుక్మిణీ వసంత్‌ హీరోయిన్ . మలయాళ నటుడు టొవినో థామస్, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్  ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల జోర్డాన్ లో మొదలైన ‘డ్రాగన్ ’ షెడ్యూల్‌ ముగిసింది.

దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్‌ అండ్‌ టీమ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. జోర్డాన్ లో ప్రధానంగా రెండు కీలకమైన యాక్షన్  సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. అయితే తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం టీమ్‌ ఎక్కువ గ్యాప్‌ తీసుకోవడం లేదట. ఈ నెలాఖరులోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ప్రారంభం కానుందట. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘డ్రాగన్ ’ మూవీని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.

Videos

మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..

Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!

యుద్ధం తధ్యం.. ఇరాన్‌లోని ఇండియన్స్ కు పిలుపు

నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్

ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్

4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..

విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!

హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?

ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

Photos

+5

'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విజయవాడలో నోరూరించే రంజాన్ రుచులు.. మీరూ ఓ లుక్కేయండి (ఫొటోలు)

+5

జ్యోతిరాయ్ 'కిల్లర్' మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)