Breaking News

జూనియర్ ఎన్టీఆర్‌ పేరుతో ఫిఫా పోస్టర్.. స్పందించిన యంగ్ టైగర్!

Published on Wed, 02/05/2025 - 16:19

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్‌ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.

అయితే ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్‌ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్‌ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఆ పోస్టర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్‌మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎ‍న్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మన యంగ్ టైగర్. ఈ పోస్టర్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గ్లోబల్ స్టార్‌ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ టైగర్‌ ఎన్టీఆర్ అంటూ జూనియర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా దేవర పార్ట్ -1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్- 2 మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. 
 

 

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)