Breaking News

'మ్యాడ్ స్క్వేర్' సెలబ్రేషన్స్ వివరాలు.. బావమరిది కోసం వస్తున్న ఎన్టీఆర్‌

Published on Fri, 04/04/2025 - 11:43

'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్‌ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్‌ గ్యాంగ్‌ (నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ )తో తారక్‌ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్‌ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.

మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.  వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్‌ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్‌ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్‌ ఇస్తారో చూడాలి.

ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్‌ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది.  ఎన్టీఆర్‌తో చిత్ర  నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన తారక్‌ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)