Breaking News

జూన్‌లో ఫిక్స్‌

Published on Wed, 04/30/2025 - 00:42

 

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) గురించి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌. ఈ సినిమాని 2026 జూన్‌ 25న రిలీజ్‌ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్‌’ వంటి హిట్స్‌ తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ ‘ఎన్టీఆర్‌ నీల్‌’.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించింది యూనిట్‌. అయితే తాజాగా ఆ తేదీకి కాకుండా 2026 జూన్‌ 25న రిలీజ్‌ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. ‘‘ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ప్రశాంత్‌ నీల్‌ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మా సినిమా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఇద్దరు డైనమిక్‌ వ్యక్తుల కాంబినేషన్‌లో బాక్సాఫీస్‌ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధంకండి. 2026 జూన్‌  25న థియేటర్లు దద్దరిల్లే సౌండ్స్‌ మీరు వింటారు. మాస్‌లకే మాస్‌ అయిన ఎన్టీఆర్‌ పుట్టినరోజున (మే 20) ప్రత్యేక గ్లింప్స్‌తో వస్తాం’’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. కాగా ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని టాక్‌. ఈ చిత్రానికి కెమేరా: భువన్‌ గౌడ, సంగీతం: రవి బస్రూర్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)