Breaking News

రావణుడిపై జూ.ఎన్టీఆర్‌ కామెంట్స్‌.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Published on Sat, 06/24/2023 - 13:16

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా  నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సినిమాలో  రావణుడిని చూపించిన విధానంపై ఇప్పటికే పలువురు మండిపడ్డారు. రావణుడి విచిత్రమైన హెయిర్ స్టైయిల్‌తో పాటు రెండు వరుసలలో పది తలకాయలను చూపించడం..  ఇలా పలు విషయాలు భారీ వివాదాలకు దారి తీశాయి.  దీంతో  ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

(ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్)

అయితే జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్  రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన  అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని  ఎన్టీఆర్‌ ఇలా తెలిపాడు.

'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు.

అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి?  అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే  ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు.

(ఇదీ చదవండి: వ్యూహం టీజర్‌..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా!)

ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఅరే తన క్యారెక్టర్‌ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆదిపురుష్​లో రావణుడి పాత్ర​ కోసం మూవీ మేకర్స్‌ ఎంతలా కసరత్తు చేయాలని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు జైలవకుశ సమయంలో ఎన్టీఆర్‌ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)