Breaking News

అగాథియా నిరుత్సాహపరచదు: జీవా

Published on Sat, 03/01/2025 - 00:59

‘‘అగాథియా’(Agathiya) వైవిధ్యమైన చిత్రం. హారర్‌ అంశాలతో పాటు తల్లి సెంటిమెంట్, దేశభక్తి వంటి అంశాలు కూడా ఉంటాయి. ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు. వారిని మా సినిమా నిరుత్సాహపరచదు’’ అని జీవా తెలిపారు. ప్రముఖ పాటల రచయిత పా.విజయ్‌ కథ అందించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అగాథియా’. జీవా, రాశీఖన్నా జంటగా, అర్జున్  సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అగాథియా’.

వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి కె.గణేష్, అనీష్‌ అర్జున్‌ దేవ్‌ నిర్మించిన ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జీవా విలేకరులతో మాట్లాడుతూ–‘‘మూడేళ్ల ప్రయాణం ‘అగాథియా’. ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. నా పాత్రతో పాటు అర్జున్‌ సర్, రాశీఖన్నా, ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌... ఇలా అందరి పాత్రలను విజయ్‌గారు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.

కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోసం చాలా రోజులు పట్టింది. యువన్‌ శంకర్‌ రాజాగారితో నా మూడో సినిమా ఇది. ఈ చిత్రం కోసం అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారాయన. దీపక్‌ కుమార్‌ పాడి విజువల్స్‌ సినిమాకి ప్లస్‌. ‘రంగం’ సినిమా నుంచి నన్ను ఎంతో ఆదరిస్తున్న తెలుగు వారికి థ్యాంక్స్‌. నేను నటించిన స్ట్రైట్‌ తెలుగు చిత్రం ‘యాత్ర 2’కి నటుడిగా మంచి పేరొచ్చింది. తెలుగులో నేరుగా మరో సినిమా చేయాలని నాకూ ఉంది. రచయితలు, దర్శకులు నా కోసం కథ సిద్ధం చేస్తే నేను రెడీ. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. రాజకీయాల ఆలోచన లేదు’’ అని తెలిపారు.

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)