Breaking News

విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ

Published on Wed, 02/22/2023 - 11:13

దివంగత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాంజలి పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి, సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయసుధ విశ్వానాథ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎంతోమంది హీరోయిన్లు విశ్వనాథ్‌ దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించలేదు అని అందరికి అనిపించి ఉంటుంది. ఎన్నో క్లాసికల్‌ సినిమాలు తీసిన ఆయనకు ఎందుకో ఆయన కమర్షియల్‌ సినిమా చేయాలనుకున్నారు. దానికి నన్ను అడిగారు. అలా ఆయన దర్శకత్వంలో నేను కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్‌ చిత్రాలు చేశాను.

అయితే ఆయన తీసిన సాగర సంగమం సినిమా నేను చేయాలి. ఏడిద నాగేశ్వరావు గారు ముందు నన్ను అడిగారు. అలాగే అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. కమల్‌ హాసన్‌ గారు బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. అదే సమయంలో నేను ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో డేట్స్‌ కుదరకపోవడంతో నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని చెప్పారు. అయితే సాగర సంగమం సినిమా కోసం నేను తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్‌ గారు నాపై చిన్నగా అలిగారు.

చాలా రోజులు నాతో మాట్లాడలేదు. నేను ఎక్కడ కనిపించిన ఆయన హూమ్‌ అన్నట్టుగా చూసేవారు. అది అలాగే చాలా రోజులు కొనసాగింది. ఆ తర్వాత నేను ఆయనతో ఇక సినిమాలు చేయలేకపోయా. కానీ నిజం చెప్పాలంటే సాగర సంగమంలో ఆ పాత్రకు జయప్రదే కరెక్ట్‌ అనిపించింది. ఆమె చాలా గొప్పగా చేసింది. అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చాల కాలం తర్వాత ఓసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ‘నాతో నటిస్తావా?’ అని అడిగారు. అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఎమోషనల్‌ అయ్యారు. 

చదవండి: 
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్‌ రష్మీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)