Breaking News

సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం.. ఎన్నో పోరాటాలు చేశా!

Published on Sun, 10/26/2025 - 04:35

సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో  పోరాటాలు చేశానని జాన్వీ కపూర్‌ వెల్లడించారు. ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ టాక్‌ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో  పోరాటాలు చేశాను.

నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్‌గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్‌. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్‌ ఖన్నా కూడా జాన్వీ కపూర్‌ మాటలను స పోర్ట్‌ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్‌ చేశానని చె ప్పారు.  
 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)