Breaking News

అక్కడ అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'

Published on Mon, 01/29/2024 - 14:15

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమా 'మంగళవారం'. పాయల్‌ రాజ్‌పుత్‌ అద్భుతమైన నటనతో పాటు థ్రిల్లింగ్ రెస్పాన్స్‌తో థియేటర్‌లలో  బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో 4 అవార్డులని గెలుచుకుంది. దీంతో ఈ సినిమాకు పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని డైరెక్టర్‌ అజయ్‌ భూపతి తెలిపారు.

డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్‌లో చెప్పినట్లుగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో 4 అవార్డులను 'మంగళవారం' సినిమా గెలుచుకుందని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలిపారు. తమ చిత్రానికి ఈ అవార్డ్స్‌ దక్కడం చాలా సంతోషం అని  విన్నర్స్‌  పేర్లు వెల్లడించారు. 

కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణంలోకి భాగమయ్యారు.

► ఉత్తమ నటి - పాయల్ రాజపుత్
► ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్
► ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్
► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)