Breaking News

'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్

Published on Wed, 08/16/2023 - 15:31

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చూసి చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' తర్వాత సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఓ మాదిరిగా వస్తున్నాయి. తాజాగా రిలీజైన 'జైలర్' మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంభోలా చేస్తోంది. రజనీ దెబ్బకు ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి.

అన్ని కోట్ల వసూళ్లు
ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' అంతగా ఆకట్టుకోలేకపోవడం రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల వరకు వచ్చాయట.

(ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!)

'విక్రమ్' రికార్డ్ బ్రేక్ 
అయితే గతేడాది కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తంగా రూ.410 కోట్లు వచ్చాయి. కానీ రజనీ 'జైలర్' మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఇప్పటివరకు తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనేది చూడాలి.

'జైలర్'కి అదే ప్లస్
రజనీకాంత్ నటించిన 'జైలర్' స్టోరీ కొత్తదేం కాదు. అయినాసరే రజనీ స్వాగ్, స్టైల్ తోపాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు 'జైలర్'కు కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోతోంది.

(ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి)

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)