Breaking News

జగపతి బాబు తల్లి ఇల్లు చూశారా? అడవిలాంటి ఇంటిలో ఒకటే రూం..

Published on Fri, 03/31/2023 - 12:34

ఇండస్ట్రీలో సీనియర్‌ నటుడు జగపతి బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ప్రతికథానాయకుడిగా మెప్పిస్తున్నారు. బాలకృష్ణ లెజెండ్‌ మూవీతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత తగ్గేదే లా అంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే జగపతి బాబుతి విభిన్న శైలి అనే విషయం తెలిసిందే. ఎలాంటి అంశమైన తన అభిప్రాయన్ని స్ట్రేట్‌ ఫార్వర్డ్‌గా చెప్పేస్తుంటాడు. అలా ఆయన చేసిన కామెంట్స్‌ వార్తల్లో నిలుస్తుంటాయి.

చదవండి: విష్ణు-మనోజ్‌ మధ్య విభేదాలు? మోహన్‌ బాబు ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే గురువారం(మార్చి 30న) శ్రీరామ నవమి సందర్భంగా జగపతి బాబు ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. హైదరాబాద్‌లోని తన తల్లి ఇల్లు చూపిస్తూ స్పెషల్‌ వీడియో పోస్ట్‌ చేశాడు. శ్రీరామ నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని చెప్పాడు. ‘అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం తాగాలనిపిచ్చింది. అందుకు మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఒక అడవిలా ఉంటుంది. కానీ, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు, నూకలతోప కావాలన్నా. ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది.

చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా

 చాలా కాలం తర్వాత అమ్మ చేతితో మంచి భోజనం చేయబోతున్నాను. అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. హ్యాపీగా ఉంటుంది. ఒక యోగి, యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ఓకే బై బై’ అంటూ జగపతి బాబు తన తల్లి ఇంటిని పరిచయం చేశారు. అయితే వాళ్ల అమ్మను మాత్రం చూపించకుండానే వీడియో ముగించారు. ఇక తన తల్లి ఇల్లు చూడటానికి తపోవనంను తలపిస్తోంది. అంతేకాదు ఆమె ఇంటి లోపలికి వెళ్లాగానే రుషి బొమ్మ కూడా దర్శనం ఇస్తుంది. చూట్టూ పచ్చని చెట్లతో ఆహ్లదకర వాతారవరణంతో అడవిని తలపిస్తున్న ఆమె ఇల్లు హైదరాబాద్‌ నడిబొడ్డున ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)