ఆర్ఆర్ఆర్‌కు పోటీగా జాక్వెలిన్ మూవీ.. ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు

Published on Wed, 01/25/2023 - 17:09

ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్  ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు. 

అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్'‍ చిత్రంలోని అప్లాజ్‌ అనే సాంగ్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్‌కు పోటీగా నిలిచింది. 

జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్,  సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. 

ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే

  •     నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
  •     అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)
  •     హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌)
  •     లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌)
  •     ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)