Breaking News

టాలీవుడ్‌లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్..దర్శకుడు ఎవరంటే?

Published on Fri, 04/03/2026 - 15:46

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో  సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో జాక్వెలిన్ సరసన నటించే హీరో ఎవరు? సినిమా టైటిల్ ఏమిటి? అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే, టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  త్వరలోనే ఈ చిత్ర టైటిట్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. 

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)