Breaking News

డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్‌

Published on Sat, 04/05/2025 - 19:40

కామెడీ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్‌, వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలివారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తనను నిజంగానే తిట్టారంటోంది నటి, కమెడియన్‌ వర్ష (Varsha). ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వర్ష మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించాను. కానీ ఒకానొక సమయంలో కొందరివి రెండు ముఖాలు చూశాను. సీరియల్‌ నుంచి షోకు వచ్చి హైలైట్‌ అయినప్పుడు వారు చూపించిన ప్రేమ సడన్‌గా మాయమవడంతో తట్టుకోలేకపోయాను.

నిజంగానే తిట్టారు
నా మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు నేను సరదాగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాళ్లు నిజంగానే తిడుతున్నారని తెలిసిందో తట్టుకోలేకపోయాను. ఛీ, దేవుడా ఎందుకీ బతుకు ప్రసాదించావు.. అడుక్కునేవారి ఇంట్లో పుట్టినా బాగుండు కదా! డబ్బు, పేరు, అందరూ ఉన్నా సుఖం లేదు. ఇలాంటి జీవితం నాకు మళ్లీ రావొద్దని దేవుడిని కోరుకుంటాను. అసలు ఈ ఫీల్డ్‌కే రావొద్దు.

కావాలనే పిలిచి
ఏడేళ్ల క్రితం నన్ను ఓ ఈవెంట్‌కు పిలిస్తే వెళ్లాను. నేనే ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని మరీ వెళ్లాను. అందరూ డ్యాన్స్‌ చేస్తున్నారు కానీ నన్ను మాత్రం పిలవట్లేదు. నన్నెప్పుడు పిలుస్తారా? అని స్టేజీ వెనకాల ఓ గుడిసెలో కూర్చున్నాను. ఓ అమ్మాయి తను రెడీ అవడానికి అద్దం పట్టుకోమని అడిగింది. గంటసేపు తనకు అద్దం పట్టుకుని కూర్చున్నాను. ఆలస్యంగా అర్థమైందేంటంటే నన్ను కావాలనే పిలిచి అలా ఖాళీగా వెనక కూర్చోబెట్టారు. అప్పుడెంతో బాధపడ్డాను అని వర్ష కంటతడి పెట్టుకుంది.

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)