Breaking News

మరో వివాదం.. 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలపై ఐటీ రైడ్

Published on Fri, 11/29/2024 - 10:40

ఈ ఏడాది రిలీజైన అద్భుత సినిమాల్లో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. పేరుకే మలయాళ మూవీ గానీ తెలుగు, తమిళంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ ఇదంతా నాణెనికి ఒకవైపు. మరోవైపు చూస్తే నిర్మాతలు.. తమతో పాటు మూవీని నిర్మించిన భాగస్వామిని మోసం చేశారు. లాభాల్లో వాటా ఇవ్వలేదని అతడి కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నిర్మాణ సంస్థ ఆఫీస్‪‌పై రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

స్నేహితుడు గుహలో పడిపోతే మిగిలిన 10 మంది స్నేహితులు కలిసి అతడిని ఎలా కాపాడారు అనే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరించాడు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే లాభాలకు.. కట్టిన ట్యాక్స్‌కి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా ఐటీ రైడ్‌లో అధికారులు గుర్తించారు. కొచిలోని పరవ ప్రొడక్షన్ ఆఫీస్‌లో గురువారం తనిఖీలు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు.. వివాదంలో చిక్కుకున్నారు. తాను కూడా సినిమా నిర్మాణంలో భాగమని.. అయితే లాభాల్లో వాటా ఇచ్చే విషయంలో మోసం చేశారని ఓ వ్యక్తి.. వీళ్లపై మారాడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అది కోర్ట్ వరకు చేరుకోవడంతో సదరు నిర్మాతల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఐటీ రైడ్స్ చేయడంతో మరోసారి 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు హాట్ టాపిక్ అయ్యారు. మరి ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారనేది అధికారులు  బయటపెట్టాల్సి ఉంది!

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)