Breaking News

‘ఇది నీకు సెట్‌ కాదు’ అనేవాళ్లను పట్టించుకోను: హీరోయిన్‌

Published on Sun, 12/22/2024 - 10:56

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో మెరుస్తున్న మరో ముత్యం సంకీర్తనా విపిన్‌! ముందు వెబ్‌తెరకు పరిచమై తర్వాత వెండితెరను మురిపిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. 

👉 సంకీర్తనా విపిన్‌.. సొంతూరు కేరళలోని నీలేశ్వర్‌ పట్టణం. తల్లిదండ్రులు సీమ, విపిన్‌లు.  బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసింది.

👉 కిందటేడు ‘నరకాసుర’తో చిత్రరంగ ప్రవేశమూ చేసింది. ఆ సినిమా కమర్షియల్‌ హిట్‌ కాకపోయినా ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. ఆమె ప్రతిభను తెలుగు చిత్ర పరిశ్రమా గుర్తించి ‘ఆపరేషన్‌ రావణ్‌’తో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్‌ చేసింది. అదీ పెద్దగా ఆడకపోయినా అవకాశాలు ఆగలేదు. ‘జనక అయితే గనక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది.  మంచి సినిమా అనే టాక్‌ను సొంతం చేసుకున్న  ఆ చిత్రం.. సంకీర్తనకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. అదిప్పుడు ‘ఆహా’లో స్ట్రీమ్‌ అవుతోంది.

👉 చిత్రకళ, ప్రయాణాల పట్లా సంకీర్తనకు మక్కువ ఎక్కువే! బీబీఏలో ఆమె ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ కూడా ట్రావెల్‌ అండ్‌ టూరిజమే! ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యాగ్‌ సర్దేస్తుంది. ఏ మాత్రం స్ట్రెస్‌ అనిపించినా కుంచె పట్టేస్తుంది.

👉 చిన్నప్పటి నుంచీ సినిమాలు అంటే ఇష్టం. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు.  ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆడిషన్స్‌కు వెళ్లేది. అలా మలయాళం వెబ్‌ సిరీస్‌ ‘ఒరు వడక్కన్‌ కేట్టుకథ’తో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీకి పరిచయం అయింది.  

👉 మాతృభాష మలయాళంలోనూ ఆమెకు చాన్సెస్‌ వస్తున్నాయి. ఆ జాబితాలోనివే ‘హిగుయిటా’, ‘కాడువెట్టి’ చిత్రాలు. ‘అసురగణ రుద్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది.  

👉 సినిమా ఫ్లాప్‌ అయిన ప్రతిసారి ‘ఇది నీకు సెట్‌ కాదు’ , ‘వేరే ప్రొఫెషన్‌ చూసుకో’ అంటూ నెగటివ్‌ కామెంట్స్‌తో వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. నేను అవేమీ పట్టించుకోను. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. నా టాలెంట్‌ మీద నమ్మకమూ జాస్తి! 
– సంకీర్తనా విపిన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)