Breaking News

ఫిలిం మేకింగ్‌లోకి ‘మేడమ్స్‌’.. ప్రొడ్యుసర్స్‌గా రాణిస్తున్న నారీమణులు

Published on Wed, 03/08/2023 - 12:55

ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్‌(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్‌’ గురించి తెలుసుకుందాం.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌  పై  ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు.  అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్  లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి.  స్వప్న సినిమాస్‌ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్  కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు.

సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్  సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది. 

నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్  సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్‌ సిరీస్  తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు  సినిమాలు నిర్మించారు.  

సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌  సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది.  అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి  నిర్మాతగా మారి... హీరో కిరణ్‌ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని  మూవీ నిర్మించింది. 

స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత  రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు.  ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ‘దిల్‌’ రాజు డిజిటల్‌ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. 

మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్‌ మహా  ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్‌ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. 

ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్‌ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది.  హీరోయిన్ అవికా గోర్‌ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌