Breaking News

ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు

Published on Sun, 10/19/2025 - 21:28

హైదరాబాద్‌ మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలో సిస్ట్లా ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. కమెడియన్ అలీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్‌ ప్రవీణ్, జైల్‌ సూపరిండెంట్‌ దామర్ల కాళిదాసు, హీరోయిన్‌లు ఎస్తర్, దివిలతో పాటు ఇన్‌ఫ్లూయన్సర్‌ బెజవాడ బేబక్క (మధు), ఎక్స్‌ యంఎల్‌ఏ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆనందలహరి వెబ్‌ సిరీస్‌ ఫేం హీరో అభిషేక్‌ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి  

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– 'ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా లాగు చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం. అందుకే ఎంతో కష్టపడి ఆరు భాషలు మాట్లాడటం నేర్చుకున్నా' అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. 'మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్‌ ఏర్పాటు చేసినందుకు లోహిత్‌ను ఎంతగానో అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి పునాది అవుతుందని అభిప్రాయపడ్డారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ.. 'నేను డిగ్రీ వరకు చదువుకున్నా. చదువు అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనుకున్నా. అందుకే నా పిల్లలకు ఒక్కటే చెప్పాను. నేను సంపాదించి మీకేం ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పా. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టిన సిస్ట్లా స్కూల్‌ యాజమాన్యానికి ముఖ్యంగా లోహిత్‌కి అభినందనలు' అన్నారు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)